పనివాళ్ళ గదిని ఇంటికి ఏ మూలలో ఇవ్వాలి?





పనివాళ్ళ గదిని ఇంటికి ఏ మూలలో ఇవ్వాలి?


పెద్దవాళ్ళు కట్టుకునే ఇళ్ళలో సహాయకారులుగా ఉండే చిన్న కుటుంబానికి ఒక గదిని ఇవ్వడం తప్పనిసరిగా మారింది. వాస్తవానికి ఇంటి లోపల వీళ్ళకు ఒక గదిని కేటాయించడం సరైంది కాదు. నేల మీద కట్టే ఇండ్లకు చుట్ట్టూ కాంపౌండ్ వాల్స్ వచ్చిన తర్వాత ఆగ్నేయంలో గాని, వాయవ్యంలోగాని వర్కర్స్ గదులను ఏర్పాటుచేయాలి. పనిచేసే వాళ్ళు కదా అనే చులకన భావంతో ఎలా పడితే అలా గది కట్టి ఇవ్వకూడదు. ‘గూటి సేవకు నియమింపబడ్డ శరీర భాగాలు పనివాళ్ళు’ అనే అంశం మరవకూడదు. ఎందుకు చెబుతున్నానంటే పనివాళ్ళు ఆరోగ్య స్థితిగతులను బట్టి గృహ దినచర్య ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇంటి మూలల్లో కాకుండా ఇంటి బయట చిన్న గదినైనా వాస్తుపరంగా కట్టివ్వాలి.