సామెతలు




>>అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

>>అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

>>అతి రహస్యం బట్టబయలు

>>అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

>>అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

>>అనువు గాని చోట అధికులమనరాదు

>>అభ్యాసం కూసు విద్య

>>అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

>>అయితే ఆదివారం కాకుంటే సోమవారం

>>ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

 >>అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అట

>>అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే

 >>అంతనాడు లేదు, ఇంతనాడు లేదు,సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు

 >>అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు

 >>అంబరాన బిడ్డ పుడితే ఆముదం పెట్టి ముడ్డి కడిగిందట

>> అందని పండ్లకు అర్రులు చాచినట్లు

>>అందని ద్రాక్షలు పుల్లన

>>అందితే సిగ అందకపోతే కాళ్ళు

>>అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు

>> అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం

>>అంధుడికి అద్దం చూపించినట్లు

>>అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ

>>అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం

 >>అగ్నికి వాయువు తోడైనట్లు

 >>అటునుండి నరుక్కు రా

 >>అడకత్తెరలో పోకచెక్క

>> అడగందే అమ్మ అయినా పెట్టదు

 >>అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు

>>అడిగేవాడికి చేప్పేవాడు లోకువ

>> అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు

 >>అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు

>>అడుసు తొక్కనేల కాలు కడగనేల

>>అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు

>> అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న

>>అతి వినయం ధూర్త లక్షణం

>>అతిరహస్యం బట్టబయలు

>> అత్త సొమ్ము అల్లుడు దానం

 >>అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.

>> అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు

>> అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు

>> అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు

>> అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు

>> అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు

>> అద్దం అబద్దం ఆడుతుందా !

 >>అనగా అనగా రాగం తినగా తినగా రోగం

>>అనుమానం పెనుభూతం

>> అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట

>> అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు

>> అన్నిదానాల్లోకి నిదానమే గొప్పదన్నాడట

>>అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు

 >>అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు

>> అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది

>> అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు

>> అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?

>> అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?

 >>అప్పనుచూడబోతే రెప్పలు పోయినై

>> అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది

 >>అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?

>> అప్పిచ్చువాడు వైద్యుడు

>> అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు

 >>అప్పు నిప్పులాంటిది...

 >>అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా?

>> అప్పు చేసి కొప్పు తీర్చిందట

>> అప్పుచేసి పప్పు కూడు

>> అప్పులేని వాడే అథిక సంపన్నుడు

>> అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు

>> అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు

 >>అబద్ధము ఆడితే అతికినట్లుండాలి

 >>అభ్యాసము కూసువిద్య

 >>అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?

>> అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు

 >>అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు

 >>అమ్మబోతే అడవి కొనబోతే కొరివి

 >>అయితే అంగలూరు కాకపోతే సింగలూరు

>> అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ
      గుండువెళ్ళి గుండావతిలో పడింది

>> అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?

>> అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో

 >>అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు

>> అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు

 >>అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం

 >>అరచేతిలో వైకుంఠం చూపినట్లు

 >>అవ్వాకావలెను బువ్వా కావలెను

>> అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...

>> అరిచే కుక్క కరవదు

 >>అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు

>> అర్దరాత్రి మద్దెల దరువు

>> అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా...

 >>అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం

>> అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట

 >>అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట

 >>అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు

>> అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట

>>ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

>>ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు 

>>ఇంట గెలిచి రచ్చ గెలువు

>>ఇల్లు పీకి పందిరేసినట్టు

>>ఎనుబోతు మీద వాన కురిసినట్టు

>>చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

>>కందకు లేని దురద కత్తిపీటకెందుకు

>>కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు 

>>కుక్క కాటుకు చెప్పుదెబ్బ

>>కోటి విద్యలు కూటి కొరకే

>>నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

>>పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

>>పిట్ట కొంచెము కూత ఘనము 

>>రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

>>వాన రాకడ ప్రాణపోకడ

>>కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

>>మీసాలకు సంపంగి నూనె

>> ఆ మొద్దు లొదే ఈ పేడు

>> ఆ తాను ముక్కే !!!

>> ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

 >>ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

>> ఆది లొనే హంస పాదు

>> ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

>> ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు

 >>ఆకాశానికి హద్దే లేదు

>> ఆలస్యం అమృతం విషం

>> ఆరే దీపానికి వెలుగు యెక్కువ

>> ఆరోగ్యమే మహాభాగ్యము

 >>ఆత్రానికి బుద్ధి మట్టు

 >>ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట

 >>ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?

>> అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

 >>అడగందే అమ్మైనా అన్నమ్ పెట్టదు

>> అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు

 >>ఏ ఎండకు ఆ గొడుగు

 >>అగడ్తలొ పడ్డ పిల్లికి అదే వైకున్ఠం

 >>అగ్నికి వాయువు తొడైనట్లు

 >>ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు

>> అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట

>> అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

>> అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

>> అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేధు

 >>అప్పు చేసి పప్పు కూడు

>> అయ్య వచే వరకు అమావాస్య ఆగుతుందా 

 >>అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

 >>బతికుంటే బలుసాకు తినవచ్చు

 >>బెల్లం కొట్టిన రాయిలా

 >>భక్తి లేని పూజ పత్రి చేటు

 >>బూడిదలో పోసిన పన్నీరు

 >>చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు

>> చాప కింద నీరులా

>> చచ్చినవాని కండ్లు చారెడు

>> చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

 >>విద్య లేని వాడు వింత పశువు

 >>చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

>> చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

 >>చక్కనమ్మ చిక్కినా అందమే

>> చెడపకురా చెడేవు

 >>చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు

 >>చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ

>> చింత చచ్చినా పులుపు చావ లేదు

>> చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర 
     టింకరవి యేమి కాయలని అడిగిందట

>> చిలికి చిలికి గాలివాన అయినట్లు

 >>డబ్బుకు లోకం దాసోహం

 >>దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

>> దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

>> దాసుని తప్పు దండంతో సరి

>> దెయ్యాలు వేదాలు పలికినట్లు

 >>దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

 >>దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

>> దొంగకు తేలు కుట్టినట్లు

 >>దూరపు కొండలు నునుపు

 >>దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

 >>దురాశ దుఃఖమునకు చెటు

 >>ఈతకు మించిన లోతే లేదు

>> ఎవరికి వారే యమునా తీరే

>> ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

>> గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద 
     మూర్ఛ పోయిందంట

 >>గాజుల బేరం భోజనానికి సరి

 >>గంతకు తగ్గ బొంత

 >>గతి లేనమ్మకు గంజే పానకము

 >>గోరు చుట్టు మీద రోకలి పోటు

>> గొంతెమ్మ కోరికలు

 >>గుడ్డి కన్నా మెల్ల మేలు

 >>గుడ్డి యెద్దు జొన్న చేలో పడినట్లు

>> గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

>> గుడి  మింగే వాడికి నంది పిండీమిరియం

 >>గుడినీ గుడిలో లింగాన్నీ మింగినట్లు

>> గుడ్ల మీద కోడిపెట్ట వలే

 >>గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట 

 >>గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

 >>గురువుకు పంగనామాలు పెట్టినట్లు

>>తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

 >>ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

 >>ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు 

 >>ఇంటికన్న గుడి పదిలం

 >>ఇసుక తక్కెడ పేడ తక్కెడ

 >>జోగి జోగి రాజుకుంటే బూడిద రాలిందంట

 >>కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

>> కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

>> కాకి ముక్కుకు దొండ పండు

>> కాకి పిల్ల కాకికి ముద్దు

>> కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

>> కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

>> కాసుంటే మార్గముంటుంది

>> కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

>> కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును

 >>కలిమి లేములు కావడి  కుండలు

>> కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుదతాదు

 >>కంచే చేను మేసినట్లు

>> కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!

>> కందకు కత్తి పీట లోకువ

 >>కందెన వేయని బండికి కావలసినంత సంగీతం

>> కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

>> కీడెంచి మేలెంచమన్నారు

>> కొండ  నాలికకి మందు  వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

 >>కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

>> కొండను తవ్వి యెలుకను పట్టినట్లు

>> కొన్న దగ్గిర కొసరు గాని కోరిన దగ్గర కొసరా

 >>కూసే గాడిద వచ్చి  మేసే గాడిదను చెరిచిందిట

>> కూటికి పేదైతే కులానికి పేదా

>> కొరివితో తల గోక్కున్నట్లు

>> కోతి పుండు బ్రహ్మాండం

>> కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

 >>కొత్తొక వింత పాతొక రోత

>> కోతి విద్యలు కూటి కొరకే 

>> కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

>> కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

>> కృషితో నాస్తి దుర్భిక్షం

 >>క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

 >>కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

>> కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

>> లేని దాత కంటే ఉన్న లోభి నయం

>> లోగుట్టు పెరుమాళ్ళకెరుక

 >>మెరిసేదంతా బంగారం కాదు

>> మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో 

 >>నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది 

 >>మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

 >>మనిషి మర్మము మాను చేవ బయటకు తెలియవు

>> మనిషి పేద అయితే మాటకు పేదా

 >>మనిషికి మాటే అలంకారం

 >>మనిషికొక మాట పశువుకొక దెబ్బ

 >>మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

 >>మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

>> మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా 

 >>మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

 >>మొక్కై వంగనిది మానై వంగునా

>> మొరిగే కుక్క కరవదు

>> మొసేవానికి తెలుసు కావడి బరువు

 >>ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

 >>ముండా కాదు ముత్తైదువా కాదు

 >> ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

 >> ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

  >>ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

  >>నడమంత్రపు సిరి నరాల మీద పుండు

  >>నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

  >>నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

  >>నవ్వు నాలుగు విధాలా చేటు

  >>నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

  >>నిదానమే ప్రధానము

  >>నిజం నిప్పు లాంటిది

 >> నిమ్మకు నీరెత్తినట్లు

  >>నిండు కుండ తొణకదు

 >> నిప్పు ముట్టనిది చేయి కాలదు

 >> నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

 >>నూరు గుర్రాలకు అధికారి ఐనా భార్యకు యెండు పూరి

 >>నెల్లాళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

  >>ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

  >>ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

 >>బతికి ఉంటే బలుసాకు తినవచ్చు 

 >> ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

  >>ఊరు మొహం గోడలు చెపుతాయి

  >>పాకి దానితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

 >> పాము కాళ్ళు పామునకెరుక

 >> పానకంలో పుడక

  >>పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

 >> పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు

  >>పండిత పుత్రః శుంఠ

  >>పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

 >> పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

 >> పట్టి పట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట

 >>పెదిమ దాటితే పృథివి దాటును
  >>పెళ్ళంటే నూరేళ్ళ పంట

  >>పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

  >>పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట

  >>పెరుగు తోట కూరలో పెరుగు యెంత  ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

 >> పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

  >>పిచ్చోడి చేతిలో రాయిలా

  >>పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

  >>పిల్లికి చెలగాటం యెలుకకు ప్రాణ సంకటం

 >> పిండి కొద్దీ రొట్టె

  >>పిట్ట కొంచెము కూత ఘనము

  >>పోరు నష్టము పొందు లాభము

  >>పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు

  >>పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేదన్నదట

  >>పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

 >> పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

  >>రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

  >>రామాయణంలో పిడకల వేట

  >>రమాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

 >>రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

  >>రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు

 >> రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

  >>రౌతు కొద్దీ గుర్రము

  >>ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

  >>చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

 >> సంతొషమే సగం బలం

  >>సిగ్గు విడిస్తే శ్రీరంగమే

  >>సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు

 >> శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు

  >>శుభం పలకరా యెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!

 >> శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది

  >>తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట

  >>తాడి తన్ను వాని తల తన్నేవాడు ఉంటాడు 

  >>తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు

  >>తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు

  >>తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా

 >> తాతకు దగ్గులు నేర్పినట్టు

  >>తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుట్టిందట

 >> తన కోపమే తన శత్రువు

  >>తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము

 >> తంతే గారెల బుట్టలో పడ్డట్లు

  >>తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు

  >>తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు

 >> తెగేదాక లాగవద్దు

 >> తిక్కలోడు తిరణాళ్ళకు వెలితే ఎక్కా దిగా సరిపొయిందంట

 >> తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు

  >>తినగా తినగా గారెలు చేదు

 >> తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి

 >> తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది

  >>ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు

  >>ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు

  >>ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు

 >> ఉత్తికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్టు 

  >>వాపును చూసి బలము అనుకున్నాడట

  >>వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు

 >> వెర్రి వెయ్యి విధాలు

  >>వినాశకాలే విపరీత బుద్ధి

  >>యే ఎండకు ఆ గొడుగు

 >> యే గాలికి ఆ చాప

 >> యెద్దు పుండు కాకికి ముద్దు

 >> యేకులు పెడితే బుట్టలు చిరుగునా

 >> యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు

  >>యెప్పుడూ ఆడంబరంగా పలికే వాడు అల్పుడు


 ఇంకా :  



ముగ్గులు     ధర్మ సందేహాలు



పిల్లల పేర్లు   స్వయం ఉపాధి