సెల్లార్‌లో ఇళ్ళు కట్టుకోవచ్చా?



సెల్లార్‌లో ఇళ్ళు కట్టుకోవచ్చా?

నేలమీద ఇళ్ళు, నేల లోపల ఇళ్ళు వీటిలో ఏది ముఖ్యమైంది, ఏది సజీవంగా ఉండేది అనే విషయం పరిశీలించినప్పుడు మొదటి దానికి నూరు మార్కులు పడతాయి. విదేశాలలో భూమి లోపల కట్టుకునే వాటిని ‘బంకర్లు’లు అని కూడా అంటారు. వాస్తవానికి ఇళ్ళు భూమిలో ఉండకూడదు. అది గృహం అనబడదు. ‘గృహ వసతులు కలిగిన సమాధి’ అనాలి. ఆధునికత పేర, స్థల దారిద్య్రం పేర ఈ ఆలోచనలు వస్తున్నాయి. కొందరు కడుతున్నారేమోగానీ భూమి లోపల అంటే ఒక గొయ్యిలో ఇళ్ళు కట్టుకోవడం సమంజసం కాదు. ఒక చెట్టు భూమి లోపల కొమ్మలతో, పువ్వులతో వికసించదు. అలాగే, భూమి గృహంలో కుటుంబ జీవనం ఆరోగ్యదాయకం కాదు. కారు పార్కింగ్ తదితర వాహన సంబంధ సదుపాయాల కొరకు వ్యాపార స్థలాలలో ఈ సెల్లార్‌లు కొన్ని రోడ్ల స్థలాలకు మాత్రమే ఉపయోగపడతాయి.