పక్షవాతానికి విరుగుడు ఏమిటి ?



పక్షవాతానికి విరుగుడు ఏమిటి ?

ఉన్నట్లుండి మాట తడబడుతుంది. ఒక కాలూ, ఒకచేయీ పడిపోతుంది . మూతి వంకర పోతుంది. ఎవరో బలవంతంగా వంచేసినట్లు శరీరంలో ఒక భాగం మెలిబడిపోతుంది. ఇవన్నీ పక్షవాతానికి సంబంధించిన లక్షణాలే. రక్తనాళాల్లో ఎక్కడో కాస్తంత కొలెస్ట్రాలో, కొవ్వో అడ్డుపడిన ఫలితమిది. పక్షవాతానికి గురెన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తే ఆ అడ్డంకిని ఒక పరికరం ద్వారా తొలగించే వీలుంది. ఇది పక్షవాతానికి గురెన వ్యక్తిని నిమిషాల్లోనే తిరిగి సాధారణ స్థితికి చేరుస్తుందని అంటున్నారు సీనియర్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ రణ్‌ధీర్‌ కుమార్‌. 

మెదడు పరిధిలోని రక్త నాళంలో ఎక్కడెనా అడ్డంకి ఏర్పడితే అది పక్షవాతానికి (హెమీ పెరేసిస్‌) దారి తీస్తుంది. ఒక కాలు, ఒక చేయి పడిపోవడం, మూతి వంకర పోవడంతో పాటు చాలా సార్లు మాట కూడా పడిపోతుంది. అయితే కేవలం రక్తనాళంలో అడ్డంకి ఏర్పడం ఒక్కటే కాకుండా రక్తనాళాల్లో ఒక్కోసారి ఒరిపిడి కారణంగా మెదడులో రక్తస్రావం కావడం వల్ల కూడా పక్షవాతం రావచ్చు.

హృద్రోగుల్లోనే ఎక్కువ: పక్షవాతం రావడం అన్నది హృద్రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హృద్రోగుల్లో గుండె రక్తనాళాల్లో ఉండిపోయిన కొలెస్ట్రాల్‌ లేదా కొవ్వు ఒక్కోసారి రక్తనాళం ద్వారా మెదడులోకి చేరుతుందింది. ఇది పక్షవాతానికి దారి తీస్తుంది. పక్షవాతం రావడానికి ముందు కొందరిలో అతి స్వల్పమెన కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మాట తడబడటం, రాస్తున్నప్పుడు చేతి కదలికల్లో ఏదో ఇబ్బంది ఏర్పడటంలాంటివి జరుగుతాయి. అయితే ఆ తరువాత ఓ రెండు గంటల్లో అతడు మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటాడు. అప్పటికి అలా పరిస్థితి చక్కబడగానే సంతోషించి ఊరుకుంటే ప్రమాదమే. నిజానికి మునుముందు ఒక తీవ్రమెన పక్షవాతం రాబోందని చెప్పే హెచ్చరికే అది. దీన్నే (టిఐఎ)ట్రాన్సియెంట్‌ ఇస్కీమిక్‌ అటాక్‌ అంటారు. అసలు ఆ లక్షణాలు కనిపించిన వెంటనే పూర్తి స్థాయి వెద్య చికిత్సలు తీసుకుంటే మునుముందు తీవ్రస్థాయి పక్షవాతం ఏదీ రాకుండానే చూసుకోవచ్చు.'

ముందుగానే సూచన: 
అందుకే అసహజమైన లక్షణాలేవెనా కనిపించినప్పుడు వెంటనే న్యూరో ఫిజిషియన్‌ను సంప్రదిస్తే యాంజియోగ్రాఫీ ద్వారా సమస్యను కనుగొంటారు. ఆ వ్యక్తికి గుండె సంబంధమెన సమస్యలేవెనా ఉన్నాయేమో కూడా పరీక్షిస్తారు. మెదడుకు వెళ్లే ప్రధాన రక్తనాళంలో ఎక్కడెనా అవరోధం ఏర్పడుతోందా అన్న విషయాన్ని కూడా చూస్తారు.

మూడు లేక నాలుగు గంటల్లోగా ఆసుపత్రిలో చేర్చాలి: 
సాధారణంగా వయసు పైబడటం, పొగతాగడం, అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు స్థూలకాయం వంటి సమస్యలేవెనా ఉంటే ఇవి కూడా రక్తనాళాల పరిధిని తగ్గిస్తూ వెళతాయి. క్రమంగా ఇవి రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటానికి దారి తీస్తాయి. ఈ కారణాలతో వచ్చే పక్షవాతం (స్ట్రోక్‌ ) గానీ మెదడులో రక్తసవ్రం (హెమరేజ్‌)గానీ తలెత్తినప్పుడు మూడు లేదా నాలుగు గంటల లోపే ఆసుపత్రికి చేర్చగలిగితే వెంటనే యాంజియోగ్రాఫీ చేసి ఏ రక్తనాళంలో ఎక్కడ అడ్డంకి ఏర్పడిందో తెలుసుకుంటాం. ఆ తరువాత క్లాట్‌ రిటక్ష్రన్‌ సిస్టమ్‌ ద్వారా ఆ అడ్డంకిని బయటికి లాగేసే ఏర్పాట్లు చేస్తాం. అందుకు అతి సూక్ష్మమెన ఒక పరికరాన్ని (కాథెడ్రాల్‌) రక్తనాళంలోంచి అడ్డంకి ఉన్న చోటికి పంపి దాన్ని బయటికి లాగేస్తాం. ఇదే కాకుండా టిపిఎ అనే విధానంలో అడ్డంకి తొలగిపోయేలా చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే సహజ రీతిలో రక్తపస్రరణ మొదలవుతుంది. ఫలితంగా అప్పటిదాకా కనిపించిన పక్షవాత లక్షణాలన్నీ క్షణాల్లో కనుమరుగెపోతాయి. ఒకప్పటి పక్షవాత చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది ఎంతో పెద్దముందడుగు.

సమయమే ముఖ్యం: 
ఈ తరహా చికిత్సల్లో రోగిని ఎంత తొందరగా ఆసుపత్రికి తీసుకువస్తారన్నది చాలా ముఖ్యం. నాలుగు గంటల లోగా తీసుకువస్తే అది చాలా ఉత్తమం. అలా వీలుకాని పరిస్థితుల్లో కనీసం ఆరు లేదా ఏడు గంటలలోపైనా రోగిని ఆసుపత్రికి త రలించడం జరగాలి. ఒకవేళ ఆ వ్యవధి కూడా దాటిపోతే రక్తపస్రరణ అందని భాగంలో మెదడు కణాలు చనిపోవడం మొదలవుతుంది. దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్తకణాలు ఉత్పన్నం కావడం కానీ, మెదడు కణాలను మార్చడం కానీ సాథ్యంకాదు... కాబట్టి జరిగే నష్టం శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే నిర్ణీత వ్యవధిలో రోగిని ఆసుపత్రికి తరలించడం ఒక్కటే మెదడును కాపాడే ఏకైక పరిష్కారం. అలా అయితేనే రోగిని తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావడం సాధ్యమవుతుంది. అయితే కొందరిలో రక్తనాళంలో అడ్డుపడిన పదార్థం మరీ గట్టిగా ఉండి బయటికి లాగడం సాధ్యం కాకపోవచ్చు.

కనీసం ఏడు గంటల్లోగా వస్తేనే: 
అలాంటి స్థితిలో ఆ భాగంలోకి ఒక బెలూన్‌ను లోనికి పంపి రక్తనాళాన్ని వ్యాకోచింప చేస్తాం. ఆ వ్యాకోచం స్థిరంగా ఉండకపోతే ఆ భాగంలో ఒక స్టెంట్‌ను కూడా అమరుస్తాం. ఈ చికిత్సల్లో అడ్డుపడిన భాగం ఒరిపిడికి గురై అందులో కొంత మెదడులోకి వెళ్లకుండా ఒక గొడుగు లాంటి పరికరాన్ని లోపల అమరుస్తారు. ఈ చికిత్సలన్నీ సకాలంలో అంటే 7 గంటల లోపే రోగిని ఆసుపత్రికి తరలిస్తేనే సాధ్యమవుతాయి. నాలుగు గంటల లోపే తీసుకువస్తే అది మరింత శ్రేయస్కరం. ఏమైనా ఈ కొత్త విధానాలు పక్షవాత చికిత్సలో ఒక పెద్ద ముందడుగే. కాకపోతే వాటి ని వినియోగించుకోవడంలోనే ఆలస్యం జరక్కుండా చూసుకోవాలి.
ా్వరా గుండెజబ్బుల బారినపడకుండానూ చూసుకోవచ్చు.

రాత్రి భోజనంలో నిషిద్ధం: 
రాత్రిపూట భోజనంలో కొంతమందికి పెరుగు లేదా మజ్జిగ అన్నంలో పచ్చళ్లను తినడం అలవాటుగా ఉంటుంది. అయితే రాత్రి వేళ చేసే భోజనంతోపాటు నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినరాదు. ఎందుకు తినకూడదనే సందేహం తలెత్తుతుంది. ఎందుకంటే రాత్రిపూట వాతం అధికముగా ఉంటుంది. నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తిన్నవారి తలలోని సూక్ష్మాతి సూక్ష్మనాడులు పగిలిపోవుట వలన పక్షవాత రోగం వచ్చే ప్రమాదం ఉన్నది. కనుక ఈ రెండు పచ్చళ్లను రాత్రిపూట తినకపోవడం మంచిది.పత్యం శతగుణం ప్రోక్తం అన్నారు కనుక సర్వ వైద్యములకు పథ్యము చేయడం మిక్కిలి శ్రేయస్కరము. అంతేకాదు.. వాత రోగులు ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్తచింతకాయ, ఉసిరి పచ్చడి తినరాదు.
పక్షవాతానికి విరుగుడు జీడిపప్పు: మన శరీరంలో ఎక్కువగా ఉండే ఖనిజాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. ఇది సుమారు 300 రకాల జీవ రసాయనిక చర్యల్లో పాలు పంచుకుంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో దీన్ని బట్టే అర్థమవుతుంది. మన శరీరంలోని మెగ్నీషియంలో సగం వరకు ఎముకల్లోనే ఉంటుంది. మిగతాది కణాల లోపల, కణజాలంలో, అవయవాల్లో ఉంటాయి. కండరాలు, వాడుల పనితీరు సక్రమంగా జరగాలంటే ఈ మెగ్నీషియం ఎక్కువగా తోడ్పడుతుంది. ఇది పక్షవాతం ముప్పునూ తగ్గిస్తున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టం ద్వారా వచ్చే పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆహారం ద్వారా తీసుకునే మెగ్నీషియంలో అదనంగా 100 మిల్లీగ్రాముల మోతాదు పెరుగుతున్నకొద్దీ పక్షవాతం ముప్పు తొమ్మిది శాతం తగ్గుతున్నట్టు కనుగొన్నారు. పొట్టు తీయని ధాన్యాలు.. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుడు జాతి కూరగాయలు (బీన్‌‌స), బాదం, జీడిపప్పు వంటి గింజపప్పుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కప్పు బీన్‌‌స లేదా ముడి బియ్యం, 30 గ్రాముల బాదం లేదా జీడిపప్పు, కప్పు ఉడికించిన పాలకూర తింటే సుమారు 100 గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేందుకూ దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినటం ద్వారా గుండెజబ్బుల బారినపడకుండానూ చూసుకోవచ్చు.

ప్రతి వెయ్యిమందిలో ఇద్దరికి: 
ప్రతి వేయిమందిలో ఒకరిద్దరు ప్రతిసంవత్సరం దీకి గురవుతున్నారు. నరాల జబ్బుతో ఆస్పత్రులలో చేరే వారిలో 20 శాతం మంది ఈ జబ్బుతో బాధపడుతున్నావారే. ఈ వ్యాధి వచ్చినవారిలో మూడవ వంతుమంది మూడు వారాలలోపు చనిపోతే సుమారు సగం మంది సంవత్సరం లోపు చనిపోతున్నారు. అధిక రక్తపోటు, డయాబెటిస్‌, రక్తంలో అధికంగా క్రొవ్వు పదార్థాలు పేరుకొపోవటం, పొగ తాగటం, గుండెజబ్బులు, మాదక ద్రవ్యాల సేవనం, ఎయిడ్‌‌స ఆనువంశికత, నోటిద్వారా గర్భరోధక మాత్రలు వాడటం వంటివి ఈ వ్యాధికి కారణాలు కావచ్చు. స్ట్రోక్‌ ఏ వయసులోనైనా రావచ్చు. అయితే వయస్సు మీరినకొద్దీ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఆడవారికన్న మగవారిలో ఎక్కువగా వస్తుంది. గుండెను, రక్తనాళాలను బాధించే అధిక రక్తపోటు, డయాబెటిస్‌ మొదలైన వ్యాధులు స్ట్రోక్‌కు దారితీస్తాయి. `రిస్‌‌క' కారణాలుగా చెప్పబడే అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన వాటి అదుపులో పెట్టాలి. ధూమపానం మానాలి. వృద్దాప్యంలో పక్షవాతం సహజంగా వస్తుందనే అపోహ చాలా మందిలో వుంది. కానీ వయసుతో మిత్తం లేకుండా ఇది ఎవరికైనా రావచ్చు. ఈ వ్యాధి సోకిన లక్షణాలు ఏ వ్యక్తిలోనైనా కనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. `సి.టి, స్కాన్‌' ద్వారా రోగనిర్థారణ చేస్తారు. శారీరకంగా అవిటితనం ఏర్పడకుండా తగిన చికిత్స చేస్తారు.

ఎవరెవరికి వచ్చే అవకాశం 
పక్షవాతం ఎవరికైనా రావచ్చు. కానీ నూటికి 98 మందికి ఈ కింది కారణాల వల్ల వస్తుంది. షుగర్‌ జబ్బు ఉన్న వారికి, బ్లడ్‌ ప్రెషర్‌ ఉన్న వారికి, ఆల్కహాల్‌ అతిగా సేవించేవారికి, శరీర వ్యాయమం ఎక్కువ లేనివారికి, అతిస్థూలంగా ఉన్న వారికి, ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేవారికి... రక్తంలో కొవ్వు పదార్థం (కొలెస్టరాల్‌) ఎక్కువగా ఉన్న వారికి, గుండె జబ్బులు ఉన్న వారికి, రక్తం గడ్డ కట్టే స్వభావం ఎక్కువగా ఉన్నవారికి...ఈ లక్షణాలున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. గుండె జబ్బు వచ్చేందుకు కూడా ఇవే మూల కారణాలు.

వ్యాధి లక్షణాలు: 
పక్షవాతం చాలా రకాలుగా వస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి క్షణాల మీద ఒక వైపు చేయి, కాలూ పడిపోవడం. దీన్ని హెమిప్లిజియా అంటా రు. ఒక వైపు మూతి వంకర కావడం. కళ్లు తిరిగి పడిపోవడం. బ్యాలెన్సు తప్పిపోయి ఆల్కహాల్‌ తాగిన మనిషిలాగా నడవడం. దీన్ని ఆరాక్సియా అంటారు. ఒక వైపు చూపు పడిపోవడం దీన్ని హెమియనోపియా అంటారు. పూర్తి స్పృహలేకుండా పడిపోవడం. దీన్ని మాసివ్‌ స్ట్రోక్‌ అంటారు. మింగడం కష్టంగా ఉండడం, నీరు తాగేటప్పుడు ముక్కు నుంచి నీరు రావడం, మాటలో మార్పు రావడం. మరికొంత మందిలో పైన చెప్పిన పక్షవాత లక్షణాలు ఏవైనా రావచ్చు. కానీ కొన్ని క్షణాలలోగానీ, కొన్ని నిముషాలలో గానీ యథాస్థితికి వస్తారు. దీనిని టి.ఐ.ఎ అంటారు.

నియంత్రణలు: 
స్ట్రోక్‌ వచ్చిన తరువాత కంటే రాకముందు తీసుకోవలసిన జాగ్రత్తలే చాలా ముఖ్యం. షుగర్‌ ఉన్నవారు షుగర్‌ను కచ్చితంగా నియంత్రించుకోవాలి. బిపిని కూడా నెలకొకసారి చెకప్‌ చేసుకుంటూ నియంత్రణలో పెట్టుకోవాలి. స్మోకింగ్‌ అలవాటు ఉన్నవారు పూర్తిగా నిలిపివేయాలి. ఆల్కహాల్‌ తగు మోతాదులో (ఒకటి, రెండు పెగ్గులు) తీసుకోవచ్చు. ఎక్కువైతే ప్రమాదం. స్ట్రోక్‌ వచ్చిన తరువాత సి.టి.స్కాన్‌, ఎంఆర్‌ఐ బ్రెయిన్‌, ఎంఆర్‌ యాంజియో, 2డి ఎకో, కెరోటిడ్‌ డాప్లర్‌ పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స చేయించుకోవాలి. రక్తనాళం బ్లాక్‌ అవటం వల్ల వచ్చే స్ట్రోక్‌ అయితే యాంటి ప్లేట్‌లెట్‌ డ్రగ్‌‌స (అంటే రక్తం పలుచబడేందుకు వాడే మందులు) వాడతారు. బిపీ. షుగర్‌ ఉంటేవాటికి తగిన మందులు వాడతారు. పక్షవాతం తీవ్రతను బట్టి పిజియో థెరపీ చేయించుకోవాలి.ఒకసారి స్ట్రోక్‌ వచ్చిన తరువాత మందులు వేసుకుంటూనే జీవనశైలిలో కూడా మార్పులు చేయాలి. నూనె పదార్థాలు తగ్గించాలి. ఆకు కూరలు, కూరగా యలు ఎక్కు వగా తీసు కోవాలి. ప్రతి రోజూ తగిన వ్యా యామం చేయా లి.
పక్షవాతంలో రకాలు: 
మెదడుకు అనేక రక్తనా ళాలు రక్తాన్ని సరఫ రా చేస్తుంటాయి. వాటిని పెద్దవి, మధ్యరకం, చిన్నవి అని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.పెద్ద రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి అవి పూడుకపోతే అప్పుడు తీవ్రమైన పక్షవాతం వస్తంది. అదే మధ్యరకం రక్తనాళాలు బ్లాక్‌ అయితే ఓ మోస్తరు స్ట్రోక్‌ చిన్నవి బ్లాక్‌ అయితే మైనర్‌ స్ట్రోక్‌ వస్తాయి. రెండు అర్థభాగాలను స్పష్ట్టంగా గుర్తించేలా మెదడు నిర్మాణం ఉంటుంది. ఇందులో కుడివైపున ఉన్న శరీర భాగాలను మెదడు ఎడమ అర్థగోళం నియంత్రిస్తుంది.అలాగే శరీరంలోని ఎడమ అర్ధగోళాన్ని కుడి అర్ధగోళం నియంత్రిస్తుంది. మాటను నియంత్రించే ప్రక్రియ అంతా ఎడమ గోళంలోనే జరుగుతుంది.మెదడు కుడివైపు భాగాలకు రక్త ప్రసరణ జరగకపోతే ఎడమ వైపు, ఎడమ మెదడుకు రక్తపస్రరణ జరగకపోతె కుడివైపు శరీర భాగాలు చచ్చుబడతాయి