వాస్తు సంపదను పెంచుతుందా ?



వాస్తు సంపదను పెంచుతుందా ?


The article comes up with some very favorable Vastu tips for making good money and succeeding in any commercial venture


ఆధునిక కాలంలో అనేక సమస్యలకు కారణం డబ్బు అంటే అతిశయోక్తి కాదు. ఏ పని చేయాలన్నా ముందుగా కావలసింది డబ్బే అనే పరిస్థితి నేడు నెలకొని ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటారు. అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొందరి ఇళ్ళల్లో కనుపిస్తుంటుంది. అందుకు కారణాలు అనేకం. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టకపోవడం, అనవసర ఖర్చులు చేయడం వంటివే కాక ఇంటికి సరైన వాస్తు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తుంది అంటున్నారు వాస్తు నిపుణులు. సంపాదించిన డబ్బును పొదుపు చేయడం లేదా మరింత డబ్బు సంపాదించాలనుకోవడానికి వాస్తు పరమైన మార్పులను కొన్నింటిని సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం…


The article comes up with some very favorable Vastu tips for making good money and succeeding in any commercial venture



ఇంటికి నైరుతి మూలను తమిళులు కుబేర స్థానమంటారు. ఇక్కడ ఎటువంటి సంప్‌ కానీ, సెప్టిక్‌ టాంక్‌ కానీ బోర్‌వెల్‌ కానీ భూమిలోపల ఎటువంటి నిర్మాణం లేకుండా చూసుకోవడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది. నగలు, ఇతర విలువైన పత్రాలు పెట్టే బీరువాలను, లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపు గోడకు వీటిని పెట్టడం మంచిది. లేదా తూర్పు లేదా ఉత్తర ముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూల ఉంచాలి. లాకర్లు ఉత్తర ముఖం తెరుచుకునేలా దక్షిణపు గోడకు పెట్టడం కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. లాకర్‌ తలుపులు ఉత్తరముఖంగా తెరుచుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిక్కుకి కుబేరుడు అధిపతి. బీరువాను ఈశాన్య మూలలో ఎప్పుడూ పెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల సంపద నష్టం జరుగుతుంది. ఆగ్నేయ, వాయువ్య దిక్కులు కూడా మంచివి కావు ఎందుకంటే దీనివల్ల అనవసర ఖర్చులు అధికమవుతాయి. డబ్బులు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ దూలం కింద ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుంది. ఈశాన్య మూల కూడా సంపద వృద్ధికి తోడ్పడుతుంది. ఇంటికి ఈ మూలన సంప్‌, బోర్‌వెల్‌ లేదా బావి నిర్మిస్తే అభివృద్ధి, స్థిరత్వం వస్తాయి.


The article comes up with some very favorable Vastu tips for making good money and succeeding in any commercial venture



ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోవడం లేక అది వృద్ధి జరగకపోవడం వంటివి ఎదుర్కొంటుంటే ఇంట్లో రాత్రంతా కనీసం ఒక దీపాన్నైనా వెలగనిస్తూ ఉండాలిట. ఎందుకంటే కాంతి కూడా ఒక రకమైన శక్తే. ఫెంగ్‌షూయ్‌ ప్రకారం దీన్ని యాంగ్‌ శక్తి అంటారు. ఇది చలనం తీసుకువస్తుంది. ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే చేపలను ఎంచుకొని ఇంటికి తెచ్చుకోవాలి. నీటిని శుభ్రంగా, గాలి వెళ్ళేలా ఉంచాలి. చేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఆ శక్తి ఇంట్లో సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. దీనిని గదిలో నైరుతి దిక్కున ఉంచడం మంచిది.



The article comes up with some very favorable Vastu tips for making good money and succeeding in any commercial venture


మీ అపార్ట్‌మెంట్‌ ముఖద్వారం పొడవైన కారిడార్‌ చివర ఉన్నప్పుడు అక్కడ ప్రవహించే శక్తి చాలా ఉధృతంగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక పెట్టుబడులకు రిస్క్‌ కాగలదు. దీనిని తగ్గించేందుకు కారిడార్‌ మధ్యలో అంటే దారికి అడ్డంగా కాదు గాని ఒక వైపు ఒక మొక్కను పెడితే ఆ ఉధృతి తగ్గుతుంది. ఇంటి ముఖ ద్వారానికి మంచి రంగులు వేయడం ద్వారా సంపదను ఆహ్వానించవచ్చు. పక్కింటివారి గోడలకు, ముఖద్వారాలకు భిన్నంగా, ఆకర్షణీయమైన రంగులు వేసుకోమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జీవితంలో ఆర్థికాంశాల పట్ల మరింత స్పష్టత కావాలనుకున్నప్పుడు మీ ఇంట్లో గాజు వస్తువులను ఒకసారి పరిశీలించండి. ముఖ్యంగా ఇంటికి గాజు కిటికీ తలుపులు వుంటే అవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. మురికిగా ఉన్న అద్దపు తలుపులు సంపదను లోనికి రానివ్వవట. కిటికీకి క్రిస్టల్స్‌ వేలాడదీయడం వల్ల శక్తి చురుకుగా ప్రవహిస్తుంది. సూర్యకిరణాలు వాటిని తాకినపుడు అవి రంగు రంగుల అద్భుత ఇంద్రధనస్సులను సృష్టిస్తాయి. నేరుగా సూర్యకిరణాలు ప్రసరించే కిటికీని ఎంచుకుని అక్క డ ఒక క్రిస్టల్‌ను వేలాడదీస్తే మీ కెరీర్‌ వృద్ధికి అది దోహదం చేస్తుందంటున్నారు.


The article comes up with some very favorable Vastu tips for making good money and succeeding in any commercial venture



ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే మొక్కలను కానీ విత్తనాలను కానీ టాయిలెట్లలో ఉంచాలి. ఇది ధన ప్రవాహం వృధా కావడాన్ని నిరోధిస్తుంది. ఎందుకంటే ఎదిగేవి ఏవైనా నీటి శక్తిని తిరిగి పీల్చుకొని రీసైకిల్‌ చేస్తుంటాయి.మీ క్యాష్‌ బాక్స్‌ను లేదా లాకర్‌ను ప్రతిఫలించేలా బీరువాలో ఒక అద్దాన్ని పెట్టండి. ఇది మీ సంపదను సంకేతాత్మకంగా రెట్టింపు చేస్తుంది. ఇంట్లో అస్సలు డబ్బు నిలబడకుండా జీవితంలోంచే అదృశ్యమైపోతున్నట్టు అనిపించినపుడు ఇంటి ఎడమ మూలన బాగా బరువుగా ఉండే వస్తులను పెట్టండి. దానితో పాటుగా బాగా వెలుతురు వచ్చేలా చూడండి. సంపదను పెంచుకోవాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా చిన్న ఫౌంటెన్‌ ఇంట్లో పెట్టుకోండి. అది డెస్క్‌ మీద పెట్టుకునేదైనా పర్లేదు. వాటర్‌ ఫౌంటెన్‌లా డబ్బును, సంపదను ఆకర్షించే శక్తి మరేదీ లేదు. నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.