సంపదలను ఇచ్చే మహా శివుడు .



సంపదలను ఇచ్చే మహా శివుడు . 
శ్రీమన్నారాయణుడు భక్తజనవత్సలుడు. భక్తుల కోరికలను తీర్చేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఆ మహావిష్ణువు తన భక్తుడైన అర్జునునికి పార్థసారథిగా రథ సారథ్యం వహించాడు. స్నేహితుడైన కుచేలునికి సకల మర్యాదలు చేసి అంతులేని ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. పాండవులు రాజసూయయాగాన్ని చేస్తూ అగ్రపూజలను అందుకుంటున్న సమయంలో, ఆ యాగానికి వచ్చిన అతిథులందరికీ పాదపూజ చేసాడు. ఇలా మనేకు ఎన్నో ఉదంతాలు కనబడుతుంటాయి.

shivaనిత్యం ఆ స్వామిని స్మరించుకుంటూ మన పనులను శ్రద్ధగా చేస్తున్నప్పుడు, తప్పకుండా మన జీవితం ఫలవంతమవుతుంది. మనం చేయాల్సిన పనులను శ్రద్ధతో చేస్తే చాలు, అదే పదివేలని పెద్దలు అన్నారు. ఇందుకు వారు, పక్షులను, జంతువులను, కీటకాలను మనకు ఉదాహరణలుగా చూపించారు. వాటిని విహంగ (పక్షుల) మార్గం, మర్కట (కోతి) మార్గం, పిపిలికా (చీమల) మార్గం అని మూడు రకాలుగా చెప్పవచ్చు.

1. విహంగమార్గం : 
ఒక పక్షికి ఓ పండు దొరికిందనుకుందాం. ఆ పక్షి ఓ చెట్టు కొమ్మపై కూర్చుని, కాళ్ళకింద పండును పెట్టుకుని, ముక్కుతో పొడుస్తూ తింటున్నప్పుడు, అకస్మాత్తుగా పండు కింద పడిపోవచ్చు. ఫలితంగా ఆ పక్షి కడుపు నిండకపోవచ్చు. ఇంతకీ కారణం దాని ఆతృతే. అలాగే కొంతమంది తాము చేయాల్సిన పనుల విషయంలో అలుపులేకుండా చేయాలని ప్రయత్నిస్తుంటారు. పక్షి తనకు దొరికిన పండును తినడానికి ప్రయత్నం చేసినట్లన్న మాట. అయితే పనిలో వారు చూపిస్తున్న తొందరే, వారి ప్రయత్నాలకు అడ్డుపడుతుంటుంది. అందుకే నిదానమే ప్రధానమన్నారు.

2. మర్కట మార్గం: 
అదే పండు ఓ కోతికి దొరికిందని అనుకుందాం, వెంటనే ఆ కోతి తనకు దొరికిన పండును నోటికి కరచుకుని ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు దూకుతుంటుంది. అలా దూకుతున్నప్పుడు, ఏదో ఒక సమయంలో నోట్లోని పండు కిందికి జారిపడిపోవచ్చు. ఈ విధంగా, చేసేపనిలో స్థిరత్వం లేనప్పుడు ఫలితం శూన్యంగానే లభిస్తుంది. పట్టు సడలినప్పుడు పండు మట్టిపాలవుతుంటుంది. ఇక్కడ పండు స్థానంలో మనం చేయాలనుకున్న పని అని చెప్పుకోవచ్చు

3. పిపీలికా మార్గం : ఇక, అదే పండు ఓ చీమకు దొరికిందనుకుంటే, చీమ ఆ పండును జాగ్రత్తగా తను తినదగిన పండేనా అని పరిశీలించి, మెల్లగా పండు దగ్గరకెళ్ళి, కొంచెం కొంచెంగా దానిని తొలిచి, తన పుట్టలోకి తీసుకెళ్ళి దాచి పెట్టుకుని సావకాశంగా తింటుంది. పండు దొరికినప్పట్నుంచి ఆ పండును ముక్కలు ముక్కలుగా తన పుట్టలోకి చేర్చుకునేంత వరకు చీమ ఎట్టిపరిస్థితుల్లో తొందరపడదు. మనం కూడా చీమవలెనే స్థిత ప్రజ్ఙతతో పనులను అనుకూలంగా చేసుకోవాలన్నది ఈ మూడు మార్గాలు చెబుతున్న నీతి.

ఇదే విషయాన్ని ఆ సర్వేశ్వరుడు మనకు పలు సంఘటన ల ద్వారా బోధపరుస్తున్నాడు. అందుకే మనకు తన ముఖ తః భగవద్గీతను అందించాడు. వేదవ్యాసుని నుంచి ప్రతి ఒక్క పండితుడు గీతార్థసారాన్ని మనకు పంచినవారే. అంతెందుకు?గీతలోని ప్రతి అధ్యాయానికి ఉన్న మహాత్మ్యాన్ని గురించి సాక్షాత్‌ ఆ పరమశివుడే తన దేవేరి పార్వతీదేవికి కథల రూపంలో వివరించాడు. ఈ విషయాన్ని మనం పద్మపురాణం ద్వారా తెలుసుకోగలం.

శివుడు చెప్పి కథ:
దక్షిణ దేశంలో ‘ఆమర్దకపురం’ అనే నగరం ఉండేది. అక్కడ భావశర్మ అనే బ్రాహ్మణుడొకడుండేవాడు. అతడొక వేశ్యను భార్యగా చేసుకొన్నాడు. అంతేకాక మద్యమాంసాది సేవనం, దొంగతనం, వ్యభిచారం, వేట మొదలయిన వ్యసనలోలుడు. అతని స్వభావం భయంకరమైనది. అతని మనస్సులో చాలా కోరికలుండేవి. ఒకనాడు కల్లు తాగేవాళ్లంతా ఒకచోటట గుమిగూడారు. వారితోపాటు భావశర్మ కూడా పీకల వరకు తాటికల్లు సేవిం చాడు. బాగా మైకమెక్కింది. తరువాత అతనికి విపరీతమయిన అజీర్ణరోగం పట్టుకొంది. ఆ పాపాత్ముడు కొన్ని రోజులకు కాలవశాన మరణించి, ఒక తాడిచెట్టై పుట్టాడు. ఆ చెట్టు నీడలో బ్రహ్మరాక్షసభావం పొందిన ఒక భార్యాభర్తల జంట నివసిస్తుండేంది.

వారి పూర్వజన్మ వృత్తాంతమేమంటే, కుశీలుడనే పేరు గల బుద్ధిమంతుడైన పండితుడుండేవాడు. అతడు వేద వేదాంగాలు, తత్త్యాలు తెలిసినవాడు. అంతటి విద్వాంసుడైన ఆ పండితునికి లోభం ఎక్కువ. అందుచేత తన భార్యను కూడ వెంట పెట్టుకొని ఇంటింటికి పోయి బలవంతంగా దానాలను స్వీకరిస్తూ ఉండేవాడు. కాని, ఇతరులకు చిల్లిగవ్వ కూడ పోనిచ్చేవాడు కాదు. ఆ దంపతులు చనిపోయిన తరువాత బ్రహ్మరాక్షసులై ఆ తాడిచెట్టుగా మారిన భావశర్మను ఆశ్రయించారు. ఆకలి దప్పులతో చాలా కాలం అలమటించిన వారు దాని నీడకు చేరారు. ఒకరోజు ఆ రాక్షసి భార్య తన భర్తతో ‘నాథా! మనకు ఈ భయంకరమయిన దుఃఖం ఎలా తీరుతుంది?’ అని అడిగింది. ‘ఓ భామా! బ్రహ్మవిద్యోపదేశం, ఆత్మతత్త్వవిచారణ కర్మ విధి, జ్ఞానం లేకుండా మనకు విముక్తి కలుగదు’ అన్నాడు భర్త. అప్పుడామె ‘బ్రహ్మం అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి?’ అని అడిగింది. తన భార్య ఆ మాటలు పలకడంతో అతని ఆశ్చర్యానికి అంతులేదు. ఎందుచేతనంటే ఆ మాటలు భగవద్గీతలోనివి. 

అది అష్టమాధ్యాయంలోని ఒక శ్లోకపాదం. దైవవశముననే, అదృష్టవశముననే ఆమె నోట ఆ పాదం వచ్చింది. ఆమె తన భర్తను ప్రశ్నించిన విధానం యాదృచ్చికంగా భగవద్గీతలోని శ్లోకపాదం అయిందన్నమాట. ఆ మాటలు వింటూనే తన పూర్వపు ఆకారాన్ని పొందాడు. అనంతరం ఆ దంపతులిద్దరు కూడ తమ పాపాల మూట నుండి బయటపడగా అక్కడకు ఒక దివ్యవిమానం వచ్చింది. భార్యాభర్తలిద్దిరు అందులో కూర్చుని హాయిగా స్వర్గలోకానికి చేరుకున్నారు. వారి వృత్తాంతం విని స్వర్గనివాసులు కూడ ఆశ్చర్యానికి లోనయ్యారు.