నల్లేరు గొప్ప ఔషధం - ఆయుర్వేదం

నల్లేరు గొప్ప ఔషధం!


‘నల్లేరుమీద బండి’లా జీవితం సాగిపోతోంది అని, మెత్తగా సాపీగా జీవితం వుండటాన్ని ఉపమించే సామెత వాడుకలో వుంది. వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు.
హిందీలో ‘హడ్ జోడ్’గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన ‘భవప్రకాశ’ గ్రంథంలో వివరించారు.
‘సిసస్ క్వాడ్రాంగులా’ లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. దీనిలో విటమిన్‌‘సి’, కెరోటిన్ ఎ, స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు.
కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే ‘డ్యూరాబొలిన్’కంటె ఉత్తమ గుణం ఈ ‘నల్లేరు’లో వున్నాయని
పరిశోధకులు ధృవీకరించారు. అస్థ్ధితువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే ‘మ్యూకోపాలిసాక్రైడ్స్’ దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి రక్తము ద్వారా కణజాలములో కలిసి వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది.
నల్లేరు యొక్క సాంకేతిక నామం CISSUS QUADRA GULARIS లేక VITUS QUADRANGU LARIS. ఆంగ్లములో DEVILS BACK BONE అంటాఠు. దక్షిణ భారతంలో మరియు శ్రీలంకలో ఎక్కువగా లభ్యమవుతుంది.
విరిగిన ఎముకలు అతుక్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అస్థిసంహార అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం చతురస్రాకారంలో వుంది. 8-10 సెంటీమీటర్ల దగ్గర ‘గణుపు’ వుంటుంది. ఆ గణుపు దగ్గర వేరు లేక తీగల వంటి CLIMBING ROOTS వస్తాయి. ఆకులు కూడా ఆ గణుపు దగ్గరే వస్తాయి. దీని కాండం ఓషధ ప్రయోగానికి ఉపయోగిస్తుంది. తుంచితే జిగురు వస్తుంది. హిందీలో ‘హడ్‌జోడ్’గా పిలుస్తారు.
దీనిలో ఎక్కువ శాతం కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్ వంటి రసాయనాలు లభ్యమవుతాయి. ఈ ఓషధి ఘనసత్వం ఊబకాయం తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో బాగా ఉపయోగిస్తుంది. కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా అనుకోకుండా మేలును చేకూర్చే వస్తు సముదాయం మన పక్కనే వుందని గమనించకుండా వుండి ఎవరో చెబితే ‘మహౌషధి’ అది ఇతరులు చెప్పినపుడు ఆశ్చర్యమవుతుంది. అటువంటి మహౌషధి నల్లేరు.
CORTISOL వాడకంవలన ఏర్పడే ఉపద్రవాలలో ఒకటయిన ఎముకల సాంద్రత తగ్గటం, దీనిని నివారించే గుణం దీనిలో వుంది. ఎముకలలో దృఢత్వం కలిగించడమే కాకుండా ప్రక్కన వుండే కండరాలకు శక్తిని చేకూర్చుతుంది. ఇదికాక దీనిలో నొప్పి నివారణ గుణం వుండటం విశేష లక్షణం. మనం తరచుగా వాడే ఆస్పిరిన్ బ్రూఫెన్ మందులకు సరిసమానంగా నొప్పి
నివారణ గుణం నల్లేరులో వున్నదని పరిశోధనల ద్వారా తేలింది.
ప్రకృతి ప్రసాదించి విశేషగుణాలు కలిగిన నల్లేరును సమాదరించకపోవడం విచారకరం. 100 గ్రాముల ఫైటోకెమికల్స్‌ను, 267 ఎం.జిల కెరోటిన్, 398 మిల్లీ గ్రాముల విటమిన్ సి, ఇది
కాకుండా ఎముక సత్వరం అతుక్కోడానికి ఉపకరించే గుణం కూడా వుంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇటువంటి ఔషధ గుణాల మొక్క అవసరం గమనించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రోత్సాహంతో, దక్షిణ భారతంలో, శ్రీలంకలో అధికంగా లభించే ‘సిసస్ క్వాడ్రాంగులా’ను అనేక సంస్థలు పరిశోధనలు చేపట్టి ఆశ్చర్యకర ఫలితాలను వెల్లడించారు.
జంతు పరిశోధనలో దీనిని ఇచ్చిన తరువాత 21 రోజులలో విరిగిన ఎముక యొక్క రెండు చివరలు అతుక్కుని వుండటం ఎక్స్‌రేల ద్వారా గమనించారు. కార్టిలేజ్‌లో, ఆస్టియోబ్లాస్ట్ కణాలలో
మార్పును కూడా గమనించారు. యూసిబోన్ (ఫర్మాన్జా ఇండియా), బొకామో (గుఫిక్), యూనియన్, 4 డఉ-డ (AIRAN PHARMA), నల్లేరు (AGRIGOLD) ASTHI SANDH పేర్లతో మొదలయిన కంపెనీలు వివిధ బ్రాండ్లతో మార్కెట్లో నల్లేరును ప్రవేశపెట్టారు.
శాస్ర్తియ పరిశోధక అంశాలు పుష్కలంగా వుండటంతో అనతికాలంలోనే ప్రసిద్ధమైనాయి. సమతౌల్యంలేని ఆస్టియో క్లాస్టులు (ఎముకల శైథిల్యానికి కారణమయిన కణాలు) ఆస్టియో బ్లాస్టులు (ఎముకల తయారీకి కారణమయిన కణాలు) ఆస్టియో పోరోసిస్ అనే వ్యాధికి కారణమవుతాయి. ఇది ఎక్కువగా మెనోపాజ్ స్ర్తిలలో ఋతుక్రమం ఆగిపోవడం సమయంలో
కాల్షియం తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ లోపం కూడా తోడవడం ఆస్టియో పోరోసిస్ ఉపద్రవం అధికమవుతుంది. ఈ నల్లేరులో వుండే పోషక ఎనబాలిక్ గుణంవలన నల్లేరు వాడకం ఆస్టియో
పోరోసిస్‌ను నివారించవచ్చు.
ఎటువంటి దుష్ఫలితాలు దీనిలో లేవని పరిశోధకులు వెల్లడించారు. ‘లాక్షాదిగుగ్గులు’ ప్రసిద్ధమైన మందు. దీనిలో ముఖ్యమయిన ఓషధి వజ్రవల్లీ (నల్లేరు), నొప్పిని తగ్గించి, వాపును
తగ్గించే చాలా సాధారణ ఔషధం. ఎముకలకు మిత్రుడైన నల్లేరును మీ ఇంటికి ఆహ్వానించండి.
చిన్న పిల్లలలో సెరిబ్రల్ పాల్సీతో మెడ నిలపలేనప్పుడు నల్లేరు, వివిధ మూలికల మిశ్రమం మెడకు లేపనంగా వాడితే మంచి ఉపయోగం. అదేవిధంగా వెన్ను వంకరకు ఈ లేపనంతో వెన్ను
దృఢంగా ఉంటుంది.