హెర్బల్ ఫినాయిల్ తయారి పరిశ్రమ ?


 ఫినాయిల్ వాడితే నేలపై ఉన్న క్రిములు నశిస్తాయి కాని వాటిలో ఉన్న రసాయనాలు పసి పిల్లల ఆరోగ్యానికి హాని చేయవచ్చు .

కాలి పగుల్ల వంటి చర్మ సమస్యలు రావోచు, అది గాక ఖరీదయిన టైల్స్ కూడా రసాయనాల కారణంగా పాడయే అవకాశం ఉంది అలా కాకుండా పర్యావరణ హిటంగా ఉండే ఫినాయిల్ వాడకానికి ఇపుడు గిరాకి పెరుగుతోంది.

వీటిని ఆస్పత్రుల్లో , అతిది భవనాలు, పాటశాలలు, ప్రబుత్వ ఆఫీసులు, హాస్టళ్ళ వంటి వాటికి సరఫరా చేయవచ్చు ఈ రకం ఫినాయిల్ లో ముడి పదార్థంగా వేపనూనె , మంచి నీళ్ళు , సిట్రొనెల్లా నూనె, కొన్ని సహజ రంగులు.
ఉత్పతి సామర్త్యం:
రోజుకి 200 లీటర్ల ఫినాయిల్ తాయారు చేసుకోవచు, లీటర్ ముడి పదార్థానికి అయ్యే ఖర్చు రూ. 9.35 వరకు ఉంటుంది 
స్తిర వ్యయాలు :
పరిశ్రమ ప్రారంభించడానికి 500 చ. అడుగుల స్తలాన్ని కెటాయించుకొవాలి
ఫినాయిల్ తయారికి ఉపయోగించే మిక్సర్ కం ఏమల్సి ఫెయిర్ పరికరం ఖరీదు రూ. 1,00,000. ద్రవాలు కొలిచే పరికరాలకు రూ.10,000 అవుతుంది. ఇవి కాకుండా ప్లాస్టిక్ డ్రమ్ములు 
ఇతర పాత్రలు, టేబుళ్ళ కోసం 10,000 రూ. ఖర్చు పెట్టవలసి ఉంటుంది .
విద్యుత్ బిగింపు , ఫర్నిచర్ కోసం 30,000 రూ . అవుతుంది. మొత్తం స్తిర వ్యయాల కోసం 1,50,000 రూ . ఖర్చు రావచ్చు.
నెల వారిగా వ్యయాలు:
ముందుగా ముడి పదార్తాలకు అయ్యే ఖర్చు ఏంటో చూద్దాం రోజుకి 200 లీటర్ల చొప్పున సెలవు దినాలు పోను 25 పని దినాలు ఉంటాయి . లీటర్ 9.35 చొప్పున లెక్కిస్తే పాతిక రోజుల్లో అయ్యే ఖర్చు 200Xరూ. 9.35X25 రోజులు = రూ . 46,750 . ప్యాకింగ్ చేయడానికి ఒక లీటర్ సామర్త్యం ఉండే పెట్ సీసాలు , లేబుల్లకు కలిపి ఒక్కో సీసాకు నాలుగు రూపాయల వంతున ఖర్చు వస్తుంది. ఆ లెక్కన 200X25Xరూ 4 = 20,000 రూ అవుతుంది. 
పాకింగ్ చేసిన బాటిల్లను అట్ట పెట్టెలలో పెట్టాలి కావున ఒక్కొక్కటి 20 రూ చొప్పున 250 * రూ. 20 = 5,000 రూ అవుతుంది. ప్యాకింగ్ టేపులు, ఇతర ఖర్చులు కలిపి 1,000 రూ ఉంటాయి. అంటే మొత్తం ప్యాకింగ్ ఖర్చు  26,000 రూపాయలు జీతాల కింద ఇద్దరికీ నెలకు అయ్యే ఖర్చు  12,000 రూపాయలు . ఇవాన్ని కలిపి మొత్తం ఉత్పత్తి ప్రచారానికి అయ్యే ఖర్చు రూ. 10,000, రవాణా కి అయ్యే ఖర్చు రూ. 10,000 , విద్యుత్ , ఇతర నిర్వహణ ఖార్చులు 10,000 మొత్తం నెల వారి వ్యయాలు రూ . 1,14,750. అవుతుంది. 
రెండు నెలల వర్కింగ్ కాపిటల్ చేతిలో ఉంచుకోవాలి కాబట్టి అందుకు అయ్యే మొత్తం రూ .2,30,000
మొత్తం పరిశ్రమా వ్యయం:
స్తిర వ్యయాలు , రూ . 1,50,000 వర్కింగ్ కాపిటల్ రూ. 2,30,000 లతో కలిపి మొత్తం పరిశ్రమ వ్యయం రూ. 3,80,000 అవుతుంది .
లాభ నష్టాల అంచనా:
100 శాతం వినియోగ సామర్త్యం పైన సంవస్తర అమ్మకం ఆదాయం ఎంతో చూద్దాం.
200లీ x 300 రోజులు అంటే సంవస్తరానికి 60,000 లీటర్లు తయారవుతుంది. లీటర్ 35 రూ చొప్పున అమ్మితే వచ్చే ఆదాయం 21,00,000 రూపాయలు .
సంవస్తారానికి అయ్యే వ్యయం :
ఉత్పత్తి వ్యయం : రూ 1,14,750 x 12 = రూ.13,77,000
తరుగు దల: రూ.22,500 , వడ్డీ రూ.53,200 ఇవన్ని కలుపుకుంటే సంవస్తారానికి రూ.14,52,700 అవుతుంది.
లాభం: మొత్తం ఆదాయం రూ.21,00,000 నుంచి ఖర్చులు రూ. 14,52,000 పోను లాభం రూ. 6,47,000 అంటే నెలకు వచ్చే ఆదాయం రూ. 53,750 వస్తుంది.