ప్లాస్టిక్‌ బకెట్ల తయారీ పరిశ్రమ ...!


నీటిని నిల్వ ఉంచడానికి, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకొని వెళ్లడానికి బక్కెట్‌ అవసరం అని అందరికీ తెలుసు.

 వివిధ సైజుల బక్కెట్లను వివిధ అవసరాలకు ప్రతి ఇంటిలో, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో ఉపయోగిస్తారు.

 ఇనుము, అల్యూమినియం, స్టీల్‌, రాగిలతో తయారుచేసిన బక్కెట్లు తమ ఆర్థిక స్థోమతకు తగినట్లుగా ఉపయోగిస్తుంటారు.

అయితే 20 - 25 సంవత్సరాల క్రితం నుంచి లోహపు బక్కెట్ల స్థానంలో ప్లాస్టిక్‌ బక్కెట్ల వాడకం మొదలైంది. ఇప్పుడు పూర్తిగా ప్లాస్టిక్‌ బక్కెట్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు.

                           plastic bucket కోసం చిత్ర ఫలితంplastic bucket కోసం చిత్ర ఫలితంplastic bucket కోసం చిత్ర ఫలితంplastic bucket కోసం చిత్ర ఫలితంplastic bucket కోసం చిత్ర ఫలితం


హెచ్‌డిపి బక్కెట్లు

హైడెన్సిటీ పోలి ఎథిలిన్‌ ముడిపదార్థంగా తయారుచేసిన బక్కెట్లు ఎక్కువగా మార్కెట్లో తయారవుతున్నాయి. 

5 లీటర్ల నుంచి 25 లీటర్ల సామర్థ్యం వరకు వివిధ సైజుల్లో తయారుచేస్తుండగా, బరువు కూడా 250 గ్రాములు (5 లీటర్ల బక్కెట్‌) నుంచి 700 గ్రాములు (25 లీటర్లు) వరకు ఉంటున్నాయి.

మార్కెట్లో 21 లీటర్ల బక్కెట్లు సాధారణంగా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.


మార్కెట్‌ వృద్ధికి కారణాలు


కింది కారణాల వల్ల ప్లాస్టిక్‌ బక్కెట్లు ఎక్కువగా మార్కెట్‌ అవుతున్నాయి.

1. బరువు తక్కువగా ఉండటం.

2. త్వరగా పగిలే లక్షణం లేకపోవడం.

3. నిర్వహణ సులభంగా ఉండటం.

4. ఉపయోగించడంలో సురక్షితంగా ఉండటం.

5. వేడిని తట్టుకొనే సామర్థ్యం కలిగి ఉండటం.

6. రసాయనాలను తట్టుకొనే లక్షణం.

7. ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమవడం.

8. లోహపు బక్కెట్లతో పోల్చితే చాలా తక్కువ ధరలో లభించడం.


ప్లాస్టిక్‌ బక్కెట్లు - ఉపయోగం

అన్ని వర్గాల ఇళ్లలో ప్లాస్టిక్‌ బక్కెట్లను వివిధ అవసరాలకు ఉపయోగిస్తుంటారు. కొంతకాలం ఉపయోగించిన పాత బక్కెట్ల స్థానంలో కొత్త బక్కెట్లు ఉపయోగిస్తుంటారు.

 హోటళ్లు, లాడ్జ్‌లు, హాస్టళ్ల వంటి వ్యాపార సంస్థల్లో కూడా ప్లాస్టిక్‌ బక్కెట్ల ఉపయోగం విస్తృతంగా ఉంటుంది.

పెయింట్స్‌, గ్రీజు, ముద్రణ ఇంక్‌ వంటి ఉత్పత్తుల ప్యాకింగ్‌కు మూతతో కూడిన బక్కెట్లను ఉపయోగిస్తుంటారు.
ముడి పదార్థాలు, యంత్ర పరికరాలు

ప్లాస్టిక్‌ బక్కెట్ల తయారీ పరిశ్రమకు హెచ్‌డిపిఇ గ్రాన్యూల్స్‌ ప్రధాన ముడి పదార్థం కాగా ఆటోమేటిక్‌ ఇంజక్షన్‌ మౌల్డింగ్‌ యంత్రం, కంప్రెషర్‌, కూలింగ్‌ టవర్‌, స్ర్కాడ్‌ గ్రైండర్‌, మౌల్డ్‌లు, డైలు, తూనిక యంత్రాలు, ఇతర పరికరాలు ఈ పరిశ్రమకు అవసరమైన యంత్ర పరికరాలు.


తయారీ విధానం


ఇంజక్షన్‌ మౌల్డింగ్‌ యంత్రం హుపర్‌లో హెచ్‌డిపిఇ గ్రాన్యూల్స్‌ (కొత్త, రీసైకిల్‌ చేసిన) వేస్తే, అది క్రమేణా కరుగుతూ మౌల్డ్‌ బేస్‌ రంధ్రంలోకి జారుతుంది. 

తరవాత మౌల్డ్‌ ఈ ప్లాస్టిక్‌ పదార్థం గల రంధ్రంలోకి పోవడం ద్వారా బక్కెట్‌ ఆకారం ఏర్పడుతుంది. నిర్ణీత సమయంలో ప్లాస్టిక్‌ ముడి పదార్థం గట్టిపడుతుంది. అందుకు తగిన శీతల పరిస్థితులను కల్పించడం జరుగుతుంది. 

తరవాత మౌల్డ్‌ బయటకు పోవడంతో బక్కెట్‌ వెలుపలికి తీసే వీలు కలుగుతుంది. ఈ యంత్రంలో మౌల్డ్‌లను అమర్చడం ద్వారా వివిధ సైజులు బక్కెట్లను తయారు చేయవచ్చు.


మార్కెట్‌ అవకాశాలు


ఇండియన్‌ ప్లాస్టిక్‌ ఇండస్ర్టీ వర్గాల అంచనా ప్రకారం మన దేశ తలసరి ప్లాస్టిక్స్‌ వినియోగం 2012-13 సంవత్సరంలో 9.7 కేజీలు ఉండగా, అమెరికా 109 కేజీలు, చైనా 45 కేజీలు, బ్రెజిల్‌ 32 కేజీల తలసరి వినియోగంగా కలిగి ఉన్నాయి.

 దేశాభివృద్ధితో తలసరి ప్లాస్టిక్‌ వినియోగం పెరుగుతోంది. పరిశ్రమ వర్గాల వారి అంచనా ప్రకారం రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో దేశీయ తలసరి వినియోగం రెట్టింపు అవుతుంది. అందువల్ల ఇంజక్షన్‌ మౌల్డెడ్‌ ఉత్పత్తులైన బక్కెట్లకు, మగ్గులకు డిమాండ్‌ బాగా ఉంటుందని చెప్పవచ్చు.

అందువల్ల సమర్థులైన యువతకు ఇంజక్షన్‌ మౌల్డెడ్‌ ఉత్పత్తులైన బక్కెట్లు, ఇతర ఉత్పత్తుల తయారీ మంచి స్వయంఉపాధి అవకాశం అవుతుంది.


పరిశ్రమ వ్యయం

ఉత్పత్తి సామర్థ్యం: రోజుకు 600 కేజీలు (ఒక షిప్ట్‌) 600 కేజీలు

పరిశ్రమ వ్యయం: రూ. 100.00 లక్షలు (రూ.కోటి)