టీ బ్యాగ్‌ల తయారీ పరిశ్రమ


ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశంలో టీ(తేయాకు) వినియోగం గణనీయంగా వృద్ధి చెందుతోంది.

 గతంలో కేవలం నగరాలకు, పట్టణాలకు పరిమితమైన టీ స్టాల్స్‌ సంస్కృతి నేడు గ్రామాలు  కూడా
విస్తరించింది. ప్రజల ఆర్థికాభివృద్ధి, నగర ప్రాంతాలకు వలసలు, అక్షరాస్యత వృద్ధి జీవన విధానంలో
 మార్పు  వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా తేయాకు వినియోగం వృద్ధి చెందుతున్నది.
దేశీయ తేయాకుమార్కెట్:
...
దేశీయ మొత్తం తేయాకు వూర్కెట్‌ పరివూణం 96 కోట్ల కేజీలు కాగా విలువ రూ.16,000 కోట్లు.
దీనిలో 45 శాతం తేయాకు విడిగా (లూజ్‌గా) వూర్కెట్‌ జరుగుతుండగా, మిగిలినది 300లకు పైగా బ్రాండ్‌ల
 పేరుతో ప్యాకింగ్‌ చేసి వూర్కెట్‌ చేస్తున్నారు

. మొత్తం దేశీయ తేయాకు వూర్కెట్‌ పరివూణంలో 30-40 శాతం గ్రామీణ ప్రాంతాల్లో వూర్కెట్‌
 జరుగుతున్నది. తేయాకు ఉత్పత్తిలో వున దేశంలో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. తలసరి
వినియోగంలో బాగా వెనుకబడి ఉన్నది

. టర్కీ 3 కేజీలు, ఇంగ్లాండ్‌ 2 కేజీలు తలసరి వినియోగం కలిగి ఉండగా, వున దేశంలో 1400
 గ్రావుులు(2013) మాత్రమే. వున దేశంలో గుజరాత్‌ 1600 గ్రావుుల తలసరి వినియోగంతో అన్ని
రాషా్ట్రల కంటే వుుందు ఉంది. ఆర్థికాభివృద్ధితోపాటు తలసరి తేయాకు వినియోగం భవిష్యత్తులో
 వురింత పెరిగే అవకాశాలున్నాయి.
ఆరోగ్య ప్రయోజనాలు...
సాధారణ టీ రోజు 2 లేదా 3 కప్పులు/ గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీలను 5 కప్పుల వరకు తాగడం ఆరోగ్యానికి
వుంచిదని పరి శోధనలు తెలుపుతున్నాయి.

 వేర్వేరు తేయాకు రకాల వల్ల దేనికదిగా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. స్థూలంగా తేయాకు తాగడం
 వల్ల వూనసిక ఉత్సాహం వృద్ధి చెందడం, జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి వృద్ధి, శారీరక బరువు తగ్గడం,
వుధుమేహం నియంత్రణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిరూపితమైంది.
దాంతో వివిధ రకాల తేయాకు పానీయాలను తాగడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు.
బ్యాగ్‌ల్లో తేయాకు...
కాగితం లేదా నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌తో చేసిన చిన్న సంచి(బ్యాగ్‌)లో 2 నుంచి 5 గ్రావూల వరకు తేయాకు
 పొడి, ఇతర సుగంధ ద్రవ్యాలు చేర్చిన మిశ్రవూన్ని ప్యాకింగ్‌ చేస్తారు. దీనికి ఒక చివర చిన్న
అట్టవుుక్క కట్టి దారం తో అనుసంధానం చేస్తారు. వీటినే టీ బ్యాగ్‌లుగా వ్యవహరిస్తున్నారు.
ఒక కప్పు లేదా గ్లాసులో ఒక టీ బ్యాగ్‌ వేసి బాగా వురిగే నీటిని లేదా పాలను పోసి అవసరాన్ని బట్టి
చక్కెర లేదా బెల్లంపొడి లేదా షుగర్‌ ఫ్రీ చేర్చి దారంతో టీ బ్యాగ్‌ ను కదిలిస్తూ 2 లేదా 3 నిమి షాల్లో
 రుచికరమైన, ఆరోగ్యకర మైన తాగడానికి అనువైన టీని తయారు చేసుకోవచ్చు. సంప్రదాయ
 విధానంతో పోలిస్తే టీ బ్యాగ్‌లతో తయారీ అతి సులభం కావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా టీ
 బ్యాగ్‌ల వినియోగం గణనీయంగా పెరుగుతున్నది.
ప్రపంచ టీ బ్యాగ్‌ల వినియోగం...
దేశీయ మొత్తం తేయాకు వినియోగం లో ఇంగ్లాండ్‌లో 96శాతం, అమెరికాలో 65శాతం, జర్మనీలో
92 శాతం, రష్యాలో 65 శాతం బ్యాగ్‌లు వినియోగిస్తుండగా వునదేశంలో కేవలం పరివూణంలో
2 శాతం, విలువలో 4 శాతంగా ఉన్నది. కనుక భవిష్యత్తులో టీ బ్యాగ్‌ల వూర్కెట్‌ ఉజ్వలంగా ఉంటుందని
 చెప్పవచ్చు.
మధ్యతరగతి, సంపన్న తరగతి గృహాల్లో రెస్టారెంట్స్‌, హోటళ్లలో కూడా టీ బ్యాగ్‌ల వినియోగం
వృద్ధి చెందుతోంది. సాధారణ టీ, హెర్బల్‌ టీ, బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ, ఆర్గానిక్‌ టీ, ఆయుర్వేదిక్‌ టీ వంటి
 వివిధ రకాల టీ (తేయాకు) ద్రవ్యాలను బ్యాగ్‌లలో ప్యాకింగ్‌ చేసి ఆకర్షణీయమైన అట్టపెట్టెల్లో ప్యాక్‌
చేసి వూర్కెట్‌ చేసుకోగలిగితే ప్రయోజనం అని చెప్పవచ్చు.


పరిశ్రమ వ్యయం...

Production Capacity: గంటకు 2000 టీ బ్యాగ్‌లు (3 లేదా 4 గ్రా.లు)
పరిశ్రమవ్యయం: రూ.25.00 లక్షలు