తల్లిపాలు శ్రేయస్కరం


పిల్లలకు తల్లిపాలు అమృతంతో సమానమన్న సంగతి తెలిసిందే. ఇవి శిశవులకు కావలసిన ఆహారాన్ని సమకూరుస్తూనే రోగనిరోధక శక్తినీ పెంపొందిస్తాయి. ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి. అందుేక పుట్టిన తర్వాత ఆర్నెళ్ళ వరకు తల్లిపాలు తప్ఫ మరేదీ ఇవ్వకూడదని ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్దేశించింది. అయితే తల్లిపాలు తాేగ పిల్లల్లో తెలివితేటలు కూడా పెరుగుతాయంటే నమ్ముతారా? అంతలా ఆశ్చర్యపోకండి. పోతపాలు తాగిన పిల్లలతో పోలిస్తే ఆర్నెళ్ళకు పైగా తల్లిపాలు తాగిన పిల్లల్లో 3.8 పాయింట్ల ఐక్యూ ఎక్కువగా ఉంటున్నటు్ట పొలాండ్‌లో చేసిన అధ్యయనంలో వెల్లడైంది మరి. జాగిలోనియన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వీస్లా డ్రీచోస్కీ బృందం తల్లిపాలు, పోతపాలు తాగిన పిల్లలను ఎంచుకొని ఏడేళ్ళ పాటు పరిశీలించింది. చిన్నప్ఫటు్నంచి నర్సరీకి (ప్రి స్కూల్‌) వెళ్ళే వరకు ఐదుసార్లు వారి తెలివి తేటలను పరీక్షించింది. ఇందులో తల్లిపాలు తాగిన పిల్లల్లో ఐక్యూ గణనీయంగా ఎక్కువగా ఉన్నటు్ట తేలటమే విచిత్రమనుకుంటే.. ఇది తల్లిపాలు తాగిన సమయాన్ని బట్టీ ఆధారపడి ఉండటం మరింత విచిత్రం. మూణ్నాళ్ళ వరకు తల్లిపాలు తాగినవాళ్లు 2.1 పాయింటు్ల, 4-6 నెలల వరకు తాగినవాళ్లు 2.6 పాయింటు్ల, ఆర్నెళ్ళ కన్నా ఎక్కువ సమయం తాగినవాళ్లు 3.8 పాయింట్ల మేరకు ఐక్యూ అధికంగా కలిగిఉన్నటు్ట వెల్లడైంది.

ఇంతకీ పిల్లల మేధోశక్తిని పెంచటంలో పోతపాలల్లో లేనివి తల్లిపాలల్లో ఉన్న రసాయనాలేంటి? దీనిపై ఆసక్తికరమైన చర్చ, పరిశోధనలు జరుగుతున్నాయి. తల్లిపాలలోని ఆయా రసాయనాల కోసం శాస్త్రవేత్తలు ఇంకా శోధిస్తూనే ఉన్నారు గానీ.. తల్లీబిడ్డల మధ్య ఏర్ఫడే అనుబంధమే అసలు కారణమని నేషనల్‌ ఇన్‌స్టిటూ్యట్‌ ఆఫ్‌ చైల్‌‌డ హెల్‌‌త అండ్‌హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌కు చెందిన టోన్‌‌స రాజు అంటున్నారు. ``తల్లి రొమ్ము నుంచి శిశవు పాలు పీల్చటమనేది ేకవలం కడుపు నింపుకునే పనికాదు. ఇందులో చురుెకన, పరస్ఫర, శారీరక, మానసిక సంభాషణ దాగుంది'' అని ఆయన వివరిస్తున్నారు. పాలు ఇస్తున్నప్ఫుడు తల్లీ పిల్లల మధ్య పరస్ఫర శారీరక, మానసిక బంధం ఏర్ఫడుతుందని.. ఇది శిశవు తెలివి తేటల అభివృద్ధికి దోహదం చేస్తుందని చెబుతున్నారు.పుట్టిన తర్వాత ఏడాదిలోపే పిల్లల మెదడు రెండింతల బరువు పెరుగుతుంది. ఇందులో చాలావరకు మెదడులోని తెల్ల పదార్థానికి (వైట్‌ మ్యాటర్‌) సంబంధించిందే. ఈ భాగంలోని నాడులపై విద్యుత్‌ బంధనం (మైఎలినేషన్‌) ఏర్ఫడితే అవి 50 రెటు్ల అధిక వేగంతో విద్యుత్‌ ప్రకంపనాలను ప్రసారం చేస్తాయి. ఈ ప్రక్రియ పుట్టిన తర్వాత బాల్యం నుంచి కౌమారదశలోనే ఎందుకు ఏర్ఫడతాయనే దానిపై అధ్యయనంలో దృష్టి సారించారు. చిన్నతనంలో ఎదురైన అనుభవాలు మైఎలినేషన్‌ను ప్రభావితం చేస్తాయని, పరిసరాలకు తగ్గటు్ట గా మెదడు ఎదగటానికి ఇది తోడ్ఫడుతున్నటు్ట తేలింది. తల్లి దండ్రులు మాటల రూపంలో చూపించే ఆప్యాయత చిన్నతనంలో ఐక్యూపై కీలకమైన ప్రభావం చూపిస్తుందని హార్వర్‌‌డ మెడికల్‌ స్కూల్‌కు చెందిన మార్టిన్‌ యిచర్‌ అంటున్నారు.

ఏడాదిలోపు పిల్లల్లో ేకవలం మెదడు పరిమాణం పెరగటమే కాదు.. చూపు, కదలికలు, శబ్దాల ప్రక్రి యలకు సంబంధించిన భాగాల్లోనూ ఈ సమయంలోనే ప్రధానమైన మార్ఫులు జరుగుతాయి. భాషను అర్థం చేసుకోవటం, నేర్చుకోవటం వంటి వాటికి ఇదే పునాది వేస్తుంది. ఇవన్నీ కూడా శిశవుకు ఎదురైన అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. రొమ్ము నుంచి పాలు పీలుస్తున్నప్ఫుడు తల్లీ పిల్లల మధ్య జరిేగ సానుకూల భావాల ప్రసారం.. తల్లిదండ్రులు, చుటూ్ట ఉండే వారి ప్రేమపూర్వక సంభాషణలు అన్నీ కూడా శిశవు మెదడు అభివృద్ధి చెందట ంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలు ఇస్తున్నప్ఫుడు తల్లి మెదడుకు రక్తప్రసారం పెరుగుతుంది. ఆక్సిటోసిన్‌ విడుదల వుతు ంది. ఈ హార్మోన్‌ తల్లీ పిల్లల మధ్య అను బంధం పెరగటానికి దోహదం చేస్తుం ది. పిల్లల మెదƒళ్ళలోనూ ఇలాంటిదే జరుగు తుండొచ్చు అని రాజు చెబుతు న్నారు. ఒక్కమాటలో చెప్ఫాలంటే పిల్లల మెదడు అభివృద్ధి చెందటంలో తల్లిపాలు గణనీయమైన పాత్ర పోషిస్తా యన్నమాట. అదీ శిశు అభివృద్ధిలో చాలా కీలకమైన సమయంలో కావటం విశేషం.