హెర్బల్‌ షాంపు తయారి ?



హెర్బల్‌ షాంపు తయారికి కావలసిన వస్తువులు...

కుంకుడు కాయలు 100గ్రాములు, శీకాకాయలు 100గ్రా, 
మెంతులు 100గ్రా, కకోడి 200 గ్రా, సోడియం లారెట్‌ సల్ఫేట్‌ 
అరకిలో, పర్‌ఫ్వ్యూమ్‌ 25మి.లీ. సోడియం జెండో 5గ్రాములు.

రెండు లీటర్ల నీటిలో శీకాకాయ, కుంకుడు కాయలు, మెంతులు, 
మూడు కలిపి స్టీల్‌ గిన్నెలో వేసి స్టౌ పైన పెట్టి రెండు లీటర్ల నీరు ఒక లీటరు అయ్యేంత వరకు మరగనివ్వాలి. 

తర్వాత దీనిని వడగట్టుకోవాలి. వడగట్టిన దానిని మళ్ళ మరగబెట్టాలి. మరుగుతున్నప్పుడు కకోడి కలిపి తర్వాత ఎస్‌ఎల్‌సి వేసి మరిగెంత వరకు కలుపుకోవాలి. 

తర్వాత పర్‌ఫ్యూమ్‌ కలిపి స్టౌ ఆర్పివేసి దింపి సోడియం బెంజో వేసుకోవాలి. కలర్‌ ఇష్టమైతే కలుపుకోవాలి. 

ఇలా తయారైన షాంపో లైట్‌చాక్లెట్‌ కలర్‌ వస్తుంది. దీనిని మూత పెట్టకుండా గిన్నె కదలకుండా ఒకరోజు మొత్తం ఉంచుకోవాలి. తర్వాత బాటిల్స్‌లో నింపుకోవాలి.

గమనిక....
ఉప్పు నీరు వాడరాదు. నల్లానీరు మాత్రమే వాడాలి. షాంపు 
తయారు చేయడానికి కావలసిన అన్ని పదార్థాలు 180 నుండి 
200 రూపాయలకు దొరుకుతాయి. వీటి నుండి మనకు కనీసం ఒకటిన్నర లీటర్ల షాంపు వస్తుంది.