అంతిమసంస్కారాల్లో పాల్గొన్నవారిని తాకవచ్చా?


ఒక ఆచారంగా చూస్తే ఇందులో శాస్త్రీ యత ఏమీలేదు. అర్థం, హేతువు చెప్పలేని 
ఆచారాలేవీ శాస్త్రీయ ఆచారాలు కావు. అలాగని అవన్నీ దురాచారాలు కానక్కర్లేదు. 
ఒక ఆచారానికి శాస్త్రీయ ప్రాతిపదిక ఉన్నా, లేకున్నా అది పదిమందికి అపకారం కలిగిస్తే
అది దురాచారమే. 

కాబట్టి శాస్త్రీయత ఆధారంగా చేసే ఆచారాలు కూడా సదాచారాలు కానివి కొన్ని 
ఉంటాయి. ఉదాహరణకు 'బిటి వంగడాలు పండిస్తే తప్పేమిటి? వాటికి శాస్త్రీయ 
ఆధారాలు, అనుమతులు ఉన్నాయి కదా!' అనవచ్చును. 

కానీ ఆ కార్యకలాపాలు సాధారణ రైతుకు నష్టం కలిగిస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని 
మనం ఆనాచరణీయాచారంగా భావిస్తాము. ఏదేమైనా శాస్త్రీయతకు నిలబడని 
ఆచారాల్లో దురాచారాలే ఎక్కువ.

శాస్త్రీయతకు నిలబడే వాటిలో కొన్నే ఆనాచరణీయాచారాలు. చనిపోయిన వ్యక్తి 
ఏ రోగంతోనో, మరేదైనా అంటువ్యాధితోనో మరణించి ఉంటే ఆ శవాల్ని తాకినపుడు 
కొన్ని వ్యాధికారక సూక్ష్మజీవులు దహన కార్యక్రమాల వంటి అంతిమ సంస్కారాల  కు
 వెళ్లిన వారి వస్త్రాల మీదకు చేరవచ్చును. 

లేదా చనిపోయిన వ్యక్తి చనిపోయి చాలా గంటలు అయినా లేదా రోజుల తరబడి 
విదేశాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి బంధువులు వచ్చేవరకూ సరైన 
శీతలీకరణ పద్ధతులు లేకుండా శవంగా ఉంటే ఆ శవం మీద ఎన్నో బాక్టీరియాలు, 
సూక్ష్మక్రిములు ఆశిస్తాయి. 

మనకు తెలీకుండా దుర్గంధం, అవాంఛనీయమైన వాయురూప, ఇతర రూప మలినాలు 
శవం మీద, శవపేటిక మీద, శవపు వస్త్రాల మీద చేరి ఉంటాయి. అలాంటి శవాన్ని
 తాకినపుడు తాకిన వారికి, వారిని తాకిన ఇతరులకు, ఆ ఇతరులను తాకిని 
మరికొందరికి అలా అలా తదనంతరేతులందరికీ ఈ దుర్గంధం, రోగకారకం, అవాంఛనీయం
 అయిన పదార్థాల పొడ సోకి ఉండవచ్చును.

కాబట్టి వారిని పనిగట్టుకొని తాకే బదులు, వారు తమ బట్టల్ని విడిచేసి, శుభ్రంగా 
స్నానం చేసిన వచ్చిన తర్వాత అంతగా తాకాలనిపిస్తే వారిని తాకవచ్చును. కానీ 
ఇంట్లోనే ఉన్నంతమాత్రాన, ఇంట్లో శవం లేనంత మాత్రాన మనమే శుభ్రంగా ఉన్నట్టు 
మనం తాకితే ఇతరులకు ఇబ్బంది ఏమీ లేదని అనుకోవడానికీ లేదు.

 శవ సంస్కారాలకెళ్లి వచ్చినా, గోపురాల్లోనూ, పూజామందిరా ల్లోనూ, 
ప్రార్థనాస్థలాల్లోనూ ప్రార్థనల తర్వాత ఇంటికి వచ్చినా, ఎక్కడికైనా బయటికి వెళ్లి 
వచ్చినా వారు శుభ్రంగా కాళ్లూ చేతులు కడుక్కోవడం ఆచారాలకు మించిన
 సదాచారం.