తలలో పేలను తొలగించే గృహవైద్యం


 తలలో వెంట్రుకలను అంటిపెట్టుకుని రక్తాన్ని ఆహారంగా తీసుకుంటూ జీవించే 
చిన్న పరాన్న జీవులు పేలు. పిల్లలో ఒక సాధారణ సమస్యగా ఇది కనిపిస్తుంటుంది. 
ఒకరి వస్తువులను మరొకరు వాడటం ద్వారా ఇవి ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తాయి. 

దురద, గోకడం వల్ల తలమీద చర్మానికి గీరుకుని బాధ కలుగుతుంది. తలలో పేలు తొలగించుకోవడానికి రకరకాల రసాయనాలతో కూడిన ఔషధాలు, షాంపూలు 
వాడుతుంటారు. ఇవి కాకుండా, ఇంటి వద్ద చేసుకోదగిన గృహ చికిత్సలు కొన్ని 
ఉన్నాయి. అవి తెలుసుకుందాం.

వెల్లుల్లి : వెల్లుల్లిని మెత్తగా రుబ్బి పేస్టులా చేసుకోవాలి. దానికి నిమ్మరసం కలపాలి. 

ఈ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి. ఒక అరగంట తరువాత గోరువెచ్చని నీటితో జుట్టును
 శుభ్రం చేసుకుని దువ్వెనతో దువ్వుకోవాలి. అప్పుడు పేలు రాలిపోతాయి.

వైట్‌ వెనిగర్‌ : రాత్రి పడుకోవడానికి ముందు వైట్‌ వెనిగర్‌ను తలకు రాసుకుని 

తువ్వాలును తలపాగాలాగా తలకు చుట్టుకోవాలి. రాత్రంతా అలా వదిలేసి ఉదయం 
షాంపూతో జుట్టును శుభ్రంగా కడిగి దువ్వెనతో దువ్వుకుంటే పేలు రాలిపోతాయి.

ఆలివ్‌ నూనె : పేను చికిత్సకు మూడు వారాలపాటు త్రపి ఉదయం, సాయంత్రం జుట్టుకు 

ఆలివ్‌ నూనె లేదా బాదం నూనె రాసి దువ్వుకోవాలి. తల దువ్వుకోవడానికి ముళ్ల 
మాదిరిగా ఉన్న దువ్వెనను ఎంచుకోవాలి. 

ఉప్పు : పేలు తీవ్రస్థాయిలో ఎండిపోవడానికి ఉప్పు ఉపయోగపడుతుంది. అరకప్పు

 వెనిగర్‌లో ఐదు స్పూన్ల ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి.
 ఒక క్యాప్‌ ధరించి రెండు గంటలు అయ్యాక జుట్టును శుభ్రం చేసుకుని దువ్వుకోవాలి. 
ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా చేస్తుంటే సత్ఫలితాలుంటాయి.

పెట్రోలియం జెల్లీ : పెట్రోలియం జెల్లీ పేలు తిరగకుండా ఉండేలా చేస్తుంది. రాత్రి పడుకునే 

ముందు పెట్రోలియం జెల్లీని రాసుకుని రాత్రంతా అలా వదిలేయాలి. ఉదయం జెల్లీ 
తొలగించడానికి బేబీ ఆయిల్‌ను ఉపయోగించాలి. పేలను పూర్తిగా తొలగించడానికి 
జుట్టును దువ్వుకోవాలి.