అటుకులతో శరీరానికి కావలసిన పోషకాలు మీకు తెలుసా...?


మీకు తెలుసా...? చాలామంది అల్పాహారంగానో, బ్రేక్‌ఫాస్ట్‌గానో తీసుకునే 
అటుకులు కూడా ఆరోగ్యానికి శక్తినిస్తాయి. మనిషి శరీరానికి కావలసిన పోషకాలు 
ముఖ్యంగా ఇనుము (ఐరన్‌) అటుకుల్లో ఉంటుందట. అయితే వీటిని విడిగా 
తినడం కంటే... బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేసుకుని తినటంవల్ల రుచి, రుచి, పోషకాలు 
రెండూ అందుతాయి.

పోహా చేయడంలో 5 అంకాలు
1.అటుకులు నీళ్లల్లో 3, 4 నిమిషాలు నానబెట్టాలి.

2.నీరు వంపేసి, దాంట్లో తగినంత ఉప్పు, ఒక స్పూన్‌ కారం, ధనియాల పొడి 
ఒక స్పూన్‌, ఒక చిటికెడు ఇంగువ కలపాలి.

3.మూకుడులో తగినంత నూనె పోసి, ఆవాలు, పల్లీలు, కరివేపాకు, పచ్చి 
సెనగపప్పు వేయించాలి.

4.తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, సన్నగా తరిగిన ఆలూ 
ముక్కలు వేసి వేయించాలి.అందులో రెండు స్పూన్‌ల చింతపండు రసం వేసి 
రెండు నిమిషాలు కలపాలి.5.అందులో అటుకులు వేసి బాగా అడుగుకి, పైకి 
కలిపి ఐదు నిమిషాల పాటు సన్నని సెగపై ఉంచాలి. ఇక పోహా తయారు.