బట్టలపైన పడిన నూనె మరకలు పోవాలంటే ....?




 >> దుస్తుల మీద నూనె పడి మరకలు తయారైనప్పుడు వాటిని వెంటనే కడగకూడదు. 

>> ముందుగా దానిమీద పౌడర్‌ను చల్లాలి. ఇలా చేయడం వల్ల నూనె జిడ్డు పౌడర్‌కు అంటుకుంటుంది. 


oil in clothes కోసం చిత్ర ఫలితం

>> తరువాత బ్రష్‌తో మరక పోయే వరకూ రుద్దాలి. ఆ తరువాత దానిని ఉతకాలి. 
పౌడర్‌ బదులుగా చాక్‌పీస్‌ను పొడి చేసి చల్లవచ్చు.
 చాక్‌పీస్‌ పొడి చల్లి, ఒక గంటసేపు అలాగే ఉంచి, ఆ తరువాత ఉతికితే మరకలు పోతాయి. 

>> బట్టలకు గ్రీజ్‌ అంటుకున్నప్పుడు దానిపైన మొక్క జొన్న పిండిని చల్లాలి. కొంతసేపటి 
తరువాత దానిని మరొక బట్టతో తుడిస్తే ఆ మరకలు పోతాయి. 

>> పౌడర్‌ కాని, మొక్కజొన్న పొడి కాని సిద్ధంగా లేనప్పుడు న్యూస్‌ పేపర్‌ణు జిడ్డు 
మరకలపై పరచి ఉంచాలి. కాగితం నూనెను పీల్చుకుంటుంది. ఆ తరువాత మరకను 
ఉతికితే సరిపోతుంది.