స్కిన్ అలర్జీకి సమస్యలకు ఇంట్లో ఉండే ఔషదాలు

స్కిన్ అలర్జీకి సమస్యలకు ఇంట్లో ఉండే ఔషదాలు

skin allergy
1.కొన్ని రకాల స్కిన్ అలర్జీలు (చర్మం ఎర్రగా మారటం, దురదలు, వాపులు) తాత్కాలికంగా మరియు తీవ్రంగా సమస్యలకు గురి చేస్తుంటాయి. తాత్కాలికంగా ఏర్పడే చర్మ సమస్యలకు వైద్యుడిని లేదా చర్మ నిపుణులను సంప్రదించాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాలను, కొన్ని రోజులు వాడటం వలన స్కిన్ అలర్జీ మరియు ఇతరేతర చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
2.కొబ్బరి నూనె
coconut-oil
సూక్ష్మ జీవులను చంపే సహజ సిద్దమైన గుణాలను కలిగు ఉండే కొబ్బరి నూనె చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ మీరు దురదలను కలిగి ఉన్నట్లయిటే, ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను పూసి గట్టిగా రాయటం వలన దురదల నుండి ఉపశమనం పొందుతారు
3.ఆలివ్ ఆయిల్
oil image
మీరు చర్మ సమస్యలను కలిగి ఉన్నపుడు, పడుకోటానికి ముందుగా ప్రభావిత ప్రాంతాలలో ఆలివ్ ఆయిల్’తో మసాజ్ చేయండి. అంతేకాకుండా, ఆలివ్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె రెండింటిని కలిపి వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా చేసిన తరువాత ప్రభావిత ప్రాంతాన్ని వేడి గుడ్డతో చుట్టాలి, చర్మం నూనెను గ్రహించుకున్న తరువాత గుడ్డను తొలగించాలి.
4.వేప
Neem-Leaves-benefits-Skin-Hair-Health
వేప చెట్టు ఉత్పత్తులు యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. ఈ గుణాలను కలిగి ఉండటం వలన చర్మానికి కలిగే వివిధ రకాల సమస్యలకు, మొటిమలకు, గజ్జి, తామర వ్యాధులను తగ్గించటానికి వేపను వాడుతుంటారు
5.నల్ల మిరియాల
skin allergy5
నల్ల మిరియాలను సహజసిద్ద ‘డి-టాక్సీఫయర్’గా చెప్పవచ్చు, కానీ చర్మ సమస్యలకు చాలా అరుదుగా వాడుతుంటారు. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండటం వలన చర్మాన్ని అందంగా కనపడటానికి మరియు స్వస్థతలకు గురైన చర్మానికి చికిత్సలుగా ఈ నల్ల మిరియాలను వాడుతుంటారు.